ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గిన మరణాలు..!

|

Sep 05, 2020 | 8:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,825 పాజిటివ్ కేసులు, 71 మరణాలు సంభవించాయి.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గిన మరణాలు..!
Follow us on

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,825 పాజిటివ్ కేసులు, 71 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,87,331కి చేరింది. ఇందులో 1,00,800 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,79,209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4347కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 11,941 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1399 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,35,317 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 549, చిత్తూరులో 938, తూర్పు గోదావరిలో 1399, గుంటూరులో 641, కడపలో 1039, కృష్ణాలో 337, కర్నూలులో 433, నెల్లూరులో 1046, ప్రకాశంలో 1332, శ్రీకాకుళంలో 601, విశాఖలో 765, విజయనగరంలో 642, పశ్చిమ గోదావరిలో 1103 కేసులు నమోదయ్యాయి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..