
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయ్యింది. సోమవారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. ఈ రోజు కానీ రేపు (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముంది.
ఆగస్టు 13న అచ్చెన్నాయుడికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. ఈఎస్‌ఐ (ESI) మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.