దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజులో 12,881 కేసులు

|

Jun 18, 2020 | 10:49 AM

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 12,881 మందికి కోవిడ్-19 సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. కొత్త‌గా 334 మంది వైర‌స్ బారిన పడి ప్రాణాలు విడిచారు.

దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజులో 12,881 కేసులు
Follow us on

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 12,881 మందికి కోవిడ్-19 సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. కొత్త‌గా 334 మంది వైర‌స్ బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 12,237కు చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,60,384గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న‌వారు 1,94,325 మంది ఉన్నారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్ర‌భుత్వాల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. దేశంలో గడచిన 24 గంటల్లో 1,65,412 శాంపిల్స్ టెస్టు చేశామ‌ని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. జూన్​ 17 వరకు 62,49,668 టెస్టులు చేసినట్లు తెలిపింది..

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేస్తోంది. అంద‌రూ ఈ వైర‌స్ నుంచి  త‌మ‌ను తాము కాపాడుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ మ‌హ‌మ్మారికి ఇప్ప‌టివ‌రకు స‌రైన వ్యాక్సిన్ లేదా మెడిసిన్ అందుబాటులోకి రాలేదు. అయినా త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇచ్చాయి. దీంతో ఇండియాలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్క‌డ అంద‌రూ గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం ఒక‌టుంది. స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం మాత్ర‌మే. క‌రోనావైర‌స్ కాదు.