Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 77 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,47,686కి చేరుకుంది. ఇందులో 96,191 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,46,716 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మరణాల సంఖ్య 4779కి చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,52,128 టెస్టులు నిర్వహించారు.
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 557, చిత్తూరులో 1040, తూర్పు గోదావరిలో 1499, గుంటూరులో 920, కడపలో 698, కృష్ణాలో 451, కర్నూలులో 497, నెల్లూరులో 778, ప్రకాశంలో 901, శ్రీకాకుళంలో 570, విశాఖలో 413, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 1081 కేసులు నమోదయ్యాయి.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..