
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కూడా కరోనా కేసుల ఉదృతి పెరిగింది. ఎనిమిది రోజుల్లోనే దేశంలో 10 వేల కేసులు పెరిగాయి. దీంతో మన దేశంలో కేసుల సంఖ్య 20 వేలకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదివేల కేసులు నమోదు కావడానికి ఈసారి కేవలం 5 రోజులు కూడా పట్టకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెల రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలో కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
కాగా.. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,449. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,474. కరోనా నుంచి 3,870 మంది భారతీయులు కోలుకోగా 640 మంది మరణించారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఈ గణాంకాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఇండియాలో ఉదృతమైతే ఆ దేశాల కంటే తీవ్ర పరిస్థితులే తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వం మరింత కృషి చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా