ఉక్కపోస్తోందని… దేవుళ్లకు కూల్‌ కూల్‌గా…

| Edited By:

May 10, 2019 | 4:32 PM

అసలే ఎండకాలం.. ఆపై మే నెల.. ఇక సుర్యుడి ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యాహ్నం కాలు తీసి బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతకు.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు జనం. మరి నిత్యం భక్తుల మొక్కులు తీర్చే దేవుళ్ల పరిస్థితి ఎంటి..?. అదేంటి దేవుళ్లేమైనా మనుషులా.. విగ్రహాలకు ఉక్కపోత ఎంటి అని డౌట్ పడుతున్నారా..? అవును దేవుళ్లు సైతం మానవుల మాదిరిగానే ఎండ వేడిమికి సతమతమవుతున్నారని […]

ఉక్కపోస్తోందని... దేవుళ్లకు కూల్‌ కూల్‌గా...
Follow us on

అసలే ఎండకాలం.. ఆపై మే నెల.. ఇక సుర్యుడి ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యాహ్నం కాలు తీసి బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతకు.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు జనం. మరి నిత్యం భక్తుల మొక్కులు తీర్చే దేవుళ్ల పరిస్థితి ఎంటి..?. అదేంటి దేవుళ్లేమైనా మనుషులా.. విగ్రహాలకు ఉక్కపోత ఎంటి అని డౌట్ పడుతున్నారా..? అవును దేవుళ్లు సైతం మానవుల మాదిరిగానే ఎండ వేడిమికి సతమతమవుతున్నారని అంటున్నారు యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ పూజారి. అంతేకాదు కాన్పూర్‌లోని పలు దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలకు ఆలయ నిర్వాహాకులు కూలర్స్‌ను, ఫ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎండ తీవ్రత దృష్ట్యా దేవుళ్లకు పలుచని వస్త్రాలతో అలంకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.