Kitchen Hacks: ప్రస్తుత కాలంలో మనిషిజీవితం ఉరుకులు పరుగులు. ఆడామగా అనే తేడా లేకుండా ఉద్యోగం, విధులను నిర్వహించాల్సిన పరిస్థితులు. దీంతో ఉన్న సమయాన్ని అదా చేసుకుంటూ పనులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలు ఓ వైపు ఇల్లాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఉద్యోగం చేస్తుంటే మాత్రం మరింతగా రోజుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వంట ఇంట్లోనే ఉండే ఆహారపదార్ధాల విషయంలోనే కాదు .. వంట చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు..
*ఉప్పు నీరుగా మారకుండా ఉండాలంటే ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే.. చాలు. ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది.
*వేపుడు చేస్తున్న సమయంలో నూనె పీల్చకూడదు అంటే.. నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే సరి.
*పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి.
*కూరకు పులుపు తక్కువ అయినా, టమాటా రుచి కావాలన్నా.. మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.
*పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో కొబ్బరిముక్కను లేదా ఎండు మిర్చి వేసి చూడండి
*మిక్సీ బ్లేడు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లలో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఈజీగా రావాలంటే.. పెనంపై ముందుగా వంకాయ ముక్కతో రుద్దండి
*పనీర్ ఎక్కువ కాలం తాజాగా ఉండా లంటే.. పనీర్ ని బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
*వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటికి నూనె రాసి ఎండలో కొద్ది సేపు ఉంచండి.
*గ్రుడ్డుసొనకి ఒక టీస్పూన్ మైదాపిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలా సేపు అలాగే ఉంటుంది
*ఉడికిన కోడిగ్రుడ్లపై పెంకు సులభంగా రావాలంటే.. ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది
*కోడిగుడ్లు పెంకును జాగ్రత్తా పరిశీలించండి. మంచి షైనింగ్ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి.
*కోడిగ్రుడ్లు ఉడక పెట్టడానికి ఒకటి, రెండు గంటలు ముందుగానే ఫ్రిజ్ లోంచి తీసి ఉంచితే పగిలే అవకాశం ఉండదు
*దోశలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు పల్చగా వస్తాయి
*కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
Also Read: అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు