ఏపీలో మారిన రూల్స్.. కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..

| Edited By:

May 21, 2020 | 10:31 AM

ఏపీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించింది. ఇప్పటివరకు కరోనా కేసులు నమోదైన చోటు నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ గా ప్రకటిస్తుండగా.. ఇక నుంచి కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మారిన రూల్స్.. కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..
Follow us on

Containment zone : ఏపీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించింది. ఇప్పటివరకు కరోనా కేసులు నమోదైన చోటు నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ గా ప్రకటిస్తుండగా.. ఇక నుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం నుంచి 200 మీటర్ల వరకే కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని.. ఇంటివద్దకే నిత్యావసర సరుకులు, కూరగాయలు సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా.. ఐసీఎంఆర్‌ నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లను మూడు రకాలుగా వర్గీకరించారు. 10కి మించి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని ‘మోస్ట్‌ యాక్టివ్‌’గా గుర్తిస్తామని, పదిలోపు కేసులుంటే ‘యాక్టివ్‌’ అని, ఒకటి రెండు కేసులు నమోదైన ప్రాంతాన్ని ‘డార్న్‌మెంట్‌’గా గుర్తించి వైరస్‌ నివారణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఏపీలో కోవిద్-19 పాజిటివ్ కేసులు 2,407కి చేరాయి. అలాగే కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ 53 మంది మృతి చెందగా.. 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో 715 మంది చికిత్స పొందుతున్నారు.