తనపై బీజేపీ ఎంపీ దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 8:53 PM

బీజేపీ ఎంపీ జస్కౌర్ మీనా తనపై దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాసు సోమవారం లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. లోక్ సభలోనే  తనపై దాడి జరగటం సిగ్గు చేటని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్‌ను కోరారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, హింసపై.. సోమవారం ప్రతిపక్ష సభ్యులు లోక్ సభలో నిరసన వ్యక్తం చేశారు. వాటికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. […]

తనపై బీజేపీ ఎంపీ దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు
Follow us on

బీజేపీ ఎంపీ జస్కౌర్ మీనా తనపై దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాసు సోమవారం లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. లోక్ సభలోనే  తనపై దాడి జరగటం సిగ్గు చేటని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

ఢిల్లీలో జరిగిన అల్లర్లు, హింసపై.. సోమవారం ప్రతిపక్ష సభ్యులు లోక్ సభలో నిరసన వ్యక్తం చేశారు. వాటికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. తాను దళిత మహిళను కాబట్టే దాడికి పాల్పడ్డానని, ఇలాంటి ఘటనలు పదే, పదే పునారావృతం అవ్వడం దురదృష్టకరమన్నారు.

“మార్చి 2 న, మధ్యాహ్నం 3 గంటలకు, లోక్ సభ లోపల  ఎంపీ జస్కౌర్ మీనా (రాజస్థాన్ నుండి బీజేపీ పార్లమెంటు సభ్యురాలు)… నాపై శారీరకంగా దాడి చేశారు” అని హరిదాస్ తన ఫిర్యాదులో తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆత్మహత్యలొద్దంటూ స్కూల్లో రైతు కొడుకు పద్యం..అంతలోనే తండ్రి బలవన్మరణం