ఆరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..150 డివిజన్లకుగాను 116 మంది అభ్యర్థుల ఖరారు

మొత్తం 150 డివిజన్లకుగాను ఆరు విడతల్లో మొత్తం 116 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీపీసీసీ ఇవాళ తుది జాబితాను ప్రకటించింది. మరో 34 డివిజన్లకు చెందిన అభ్యర్థులను పేర్లను పెండింగ్‌లో పెట్టింది.

  • Sanjay Kasula
  • Publish Date - 9:31 pm, Fri, 20 November 20
ఆరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..150 డివిజన్లకుగాను 116 మంది అభ్యర్థుల ఖరారు

Congress Party Candidates : గ్రేటర్ పోరులో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను పూర్తి స్థాయిలో వెల్లడించింది. బీజేపీ మాత్రం గెలిచే అభ్యర్థులను నామినేషన్లు వేయాలని.. ఆ తర్వాతనే బీ ఫామ్స్ ఇస్తామని ప్రకటించింది. ఇక  కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను తాజాగా విడుదల చేసింది. పోటీ చేసేందుకు ఎంపిక చేసిన 35 మంది అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది.

మొత్తం 150 డివిజన్లకుగాను ఆరు విడతల్లో మొత్తం 116 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీపీసీసీ ఇవాళ తుది జాబితాను ప్రకటించింది. మరో 34 డివిజన్లకు చెందిన అభ్యర్థులను పేర్లను పెండింగ్‌లో పెట్టింది.

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకే నామినేషన్ల దాఖలు చేసే గడువు ముగియడంతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డివిజన్లలో ఆశావహుల చేత కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్లు వేయించినట్లు టీపీసీసీ తెలిపింది.

మొత్తం 150 డివిజన్లకు నామినేషన్లు వేసినట్లు పేర్కొంటున్న కాంగ్రెస్‌ మిగిలిన 34 మంది అభ్యర్థుల పేర్లను ఈ సాయంత్రంలోపు వెల్లడించనున్నట్లు తెలిపింది.