హార్దిక్ పటేల్‌ చెంప ఛెళ్లుమనిపించిందెవరు..?

కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేందర్ నగర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చి పటేల్ చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ ఘటనతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి చితకబాదారు. ఈ వ్యక్తి గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్నటికి..నిన్న బీజేపీ […]

హార్దిక్ పటేల్‌ చెంప ఛెళ్లుమనిపించిందెవరు..?

Edited By:

Updated on: Apr 19, 2019 | 12:44 PM

కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేందర్ నగర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చి పటేల్ చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ ఘటనతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి చితకబాదారు. ఈ వ్యక్తి గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్నటికి..నిన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా ఆయనపై శక్తి భార్గవ్ అనే వ్యక్తి చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే.