‘నితీష్ జీ ! ఎన్డీయేని వదలండి’ ! దిగ్విజయ్ సింగ్
బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తన ‘కూటనీతి’ (పకడ్బందీ వ్యూహం) తో నితీష్ కుమార్ స్థాయిని దిగజార్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎన్డీయే నుంచి వైదొలగండి అని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఓ తీగ లాంటిదని, ఓ చెట్టు అవసరం దానికి ఉంటుందని, ఆ చెట్టు ఎండిపోగానే మరో చెట్టును ఆశ్రయిస్తుందని ఆయన పేర్కొన్నారు.’ లోగడ మీరు. లాలూ యాదవ్ కలిసి పోరాడారు, ఆయన జైలుకు […]

బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తన ‘కూటనీతి’ (పకడ్బందీ వ్యూహం) తో నితీష్ కుమార్ స్థాయిని దిగజార్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎన్డీయే నుంచి వైదొలగండి అని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఓ తీగ లాంటిదని, ఓ చెట్టు అవసరం దానికి ఉంటుందని, ఆ చెట్టు ఎండిపోగానే మరో చెట్టును ఆశ్రయిస్తుందని ఆయన పేర్కొన్నారు.’ లోగడ మీరు. లాలూ యాదవ్ కలిసి పోరాడారు, ఆయన జైలుకు వెళ్లారు..మీరు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ఐడియాలజీని వదిలేసి తేజస్వి యాదవ్ ని ఆశీర్వదించండి; అని దిగ్విజయ్ సింగ్ కోరారు. తీగ వంటి బీజేపీని బీహార్ లో ఎదగనివ్వరాదన్నారు. ఇంతేకాదు,,మీరు బీహార్ ను వదిలి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కూడా అయన సూచించారు. . ఈ రాష్ట్రం చాలా చిన్నది..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కరే దేశంలో ఐడియాలజీతో సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు అని కూడా దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.