పుదుచ్ఛేరిలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. తాజాగా మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నారాయణస్వామికి సన్నిహితుడైన ఈయన 2019 లో కామరాజ్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పటివరకు రాజీనామా చేసిన వారిలో జాన్ కుమార్ నాలుగోవారు. ఈయన రాజీనామాతో పుదుచ్ఛేరి అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పదికి పడిపోయింది. పాలక, ప్రతిపక్షాలలో 14 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. నిన్ననే మంత్రులు మల్లాడి కృష్ణారావు, ఎ.నమశ్శివాయం రిజైన్ చేయగా.. ఎమ్మెల్యే ఈ. తీప్పేయిన్ జైన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్ఛేరి ని విజిట్ చేస్తున్న సందర్భంలో వీరి రాజీనామాలు సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సీనియర్ నేత ఎన్.ధనవేలును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను గత ఏడాది జులైలో అనర్హునిగా ప్రకటించారు.
ప్రస్తుతం శాసనసభలో 30 సీట్లు ఉండగా..3 నామినేటెడ్ స్థానాలు..
అసెంబ్లీలో…. ఎన్నికైన 30 మంది సభ్యులకుగాను కాంగ్రెస్ నుంచి 15 మంది భ్యులు, డీఎంకె నుంచి ముగ్గురు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. అంటే మెజారిటీ మార్క్ 16 ను ఈ ఫిగర్ దాటింది. రాజీనామాల తరువాత పాలక, ప్రతిపక్ష సభ్యులు 14 మంది ఉన్నారు. మొత్తానికి సభలో కాంగ్రెస్ బలం తగ్గింది. కాగా నమశ్శివాయమ్, తీప్పె యిన్ జైన్ గత జనవరి 25 న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ముఖ్యంగా నమశ్శివాయమ్ ఆ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే ! పుదుచ్ఛేరి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన ఆయన లోగడ ఇక్కడ కాంగ్రెస్ బేస్ ని సమన్వయ పరచడంలో, పటిష్ఠపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈయనతో బాటు ఈయన మద్దతుదారులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఇలా ఉండగా ముఖ్యమంత్రి నారాయణస్వామికి సన్నిహితుడు మల్లాడి కృష్ణారావు..గతవారమే రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాల్సిందిగా కోరుతూ ఢిల్లీకి ఆయనతో బాటు వెళ్లి వచ్చారు. అలాంటిది ఈయన రాజీనామా అత్యంత ఆశ్చర్యం కలిగించింది.
Also Read: