అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా రెడీ.. మోదీకి రాహుల్ సవాల్

|

May 04, 2019 | 2:37 PM

ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా శనివారం ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ, మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  రైతులు, కార్మికులు, యువతలో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తామన్న మోదీ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన విమర్శించారు. చౌకీదార్ అన్న వెంటనే […]

అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా రెడీ.. మోదీకి రాహుల్ సవాల్
Follow us on

ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా శనివారం ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ, మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  రైతులు, కార్మికులు, యువతలో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తామన్న మోదీ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన విమర్శించారు. చౌకీదార్ అన్న వెంటనే ప్రజలు చోర్ అంటున్నారని.. చౌకీదార్ చోర్ అన్న మాట నాదికాదని.. ప్రజల ఫీలింగ్ అని రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ తీసుకుని నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థపై  తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభంపై చర్చించడానికి కేవలం 10 నిమిషాలు కేటాయించాలని.. అందుకు అనిల్‌ అంబానీ ఇంట్లో తప్ప వేదిక ఎక్కడ ఏర్పాటు చేసినా తాను సిద్ధమేనన్నారు. త్రివిధ దళాలు తన సొంత ఆస్తులు కాదన్న విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తుంచుకోవాలన్నారు. యూపీఏ హయాంలో ఆరుసార్లు మెరుపుదాడులు జరిగాయని.. మోదీ వాటిని వీడియో గేమ్స్‌గా అభివర్ణించడం సైన్యాన్ని అవమానించడమేనన్నారు. ఐదేళ్ల పాలనలో మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. నరేంద్ర మోదీకి నేనెప్పుడూ భయపడను, వెనకడుగు వేయనని ఆయన అన్నారు. తాను జీవితమంతా దేశ ప్రజల మనసులో మాట వినడానికి ప్రయత్నిస్తానని రాహుల్ పేర్కొన్నారు.