విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.!

ఇకపై స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు రాయొచ్చు.? స్కూల్‌లో చేరకుండానే నేరుగా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పరీక్ష ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం(2020-21)లో...

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.!
Follow us

|

Updated on: Sep 23, 2020 | 7:53 PM

ఇకపై స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు రాయొచ్చు.? స్కూల్‌లో చేరకుండానే నేరుగా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పరీక్ష ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం(2020-21)లో కల్పించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాయాలంటే తప్పకుండా ఏదొక స్కూల్‌లో చదవాలి. ఈ నిబంధన అన్ని చోట్లా ఉంది. అయితే కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అంతేకాదు చాలామంది కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయాయి. దీనితో ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్లలో చదివిన విద్యార్ధుల కుటుంబాలకు ఫీజులు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి.. మరికొన్ని అయితే ఇప్పుడు చూసీ చూడనట్లు వదిలేసినా.. చివరికి మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఫైనల్ ఎగ్జామ్స్‌కు అనుమతించే పరిస్థితులు కనిపిస్తున్నాయని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేనివాళ్లు చదువు మధ్యలోనే ఆపేయకూడదనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. కాగా, స్కూల్ చేరకుండానే నేరుగా టెన్త్ పరీక్షలు రాసే సదుపాయం 2015 వరకు అమల్లోనే ఉంది. అయితే ఆ సమయంలో అంతర్గత మార్కులు ప్రవేశపెట్టడంతో ఈ విధానాన్ని విద్యాశాఖ రద్దు చేసింది. ఇక ఇప్పుడు ఆ అంతర్గత మార్కులు రద్దు చేస్తే.. నేరుగా పరీక్ష రాసే విధానాన్ని అమలు చేయవచ్చునని కొందరు అధికారులు చెబుతున్నారు. మరి చివరిగా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. (Telangana Educational Ministry)

Also Read:

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..