Cat Results Released: కామన్ అడ్మిషన్ టెస్ట్- 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఎలా తెలుసుకోవాలంటే..

| Edited By: Pardhasaradhi Peri

Jan 03, 2021 | 11:47 AM

Cat Results Released: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లలో(ఐఐఎంలలో) ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో

Cat Results Released: కామన్ అడ్మిషన్ టెస్ట్- 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఎలా తెలుసుకోవాలంటే..
Follow us on

Cat Results Released: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లలో(ఐఐఎంలలో) ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో 9 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. క్యాట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం iimcat.ac.in లింక్‌లో చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి ఈ విధమైన సూచనలు పాటించాలి.

iimcat.ac.in వెబ్ సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో, లాగిన్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోండి. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 2021 -22 సెషన్‌కు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే క్యాట్ స్కోర్లు వర్తిస్తాయి. విద్యార్థులు పంపిన దరఖాస్తుల ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది.