నన్ను తొక్కేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు.. అయినా పేరు బయటపెట్టను!

| Edited By:

Jan 10, 2020 | 3:39 PM

తెలుగు ఇండస్ట్రీలో తనను తొక్కేసిన వ్యక్తి ఎవరో తెలుసని అన్నారు కమెడియన్ శివారెడ్డి. ఇప్పటికీ తనకి అవకాశాలు లేకపోయినా కూడా ఆ పేరు బయట పెట్టనని ఆయన పేర్కొన్నారు. తాజాగా.. శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. చాలా భావోద్వేగానికి గురవుతూ.. కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. కేవలం కొంతమంది గ్రూపులయ్యి.. తనని ఇండస్ట్రీ నుంచి దూరం చేశారన్నారని వ్యాఖ్యానించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి కమెడియన్ శివారెడ్డి. అసలు మొట్ట మొదటిగా.. తెలుగు […]

నన్ను తొక్కేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు.. అయినా పేరు బయటపెట్టను!
Follow us on

తెలుగు ఇండస్ట్రీలో తనను తొక్కేసిన వ్యక్తి ఎవరో తెలుసని అన్నారు కమెడియన్ శివారెడ్డి. ఇప్పటికీ తనకి అవకాశాలు లేకపోయినా కూడా ఆ పేరు బయట పెట్టనని ఆయన పేర్కొన్నారు. తాజాగా.. శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. చాలా భావోద్వేగానికి గురవుతూ.. కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. కేవలం కొంతమంది గ్రూపులయ్యి.. తనని ఇండస్ట్రీ నుంచి దూరం చేశారన్నారని వ్యాఖ్యానించారు.

మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి కమెడియన్ శివారెడ్డి. అసలు మొట్ట మొదటిగా.. తెలుగు చిత్ర సీమకి మిమిక్రీని పరిచయం చేసింది కూడా శివారెడ్డినే. లైవ్‌గా కూడా ఎందరో సెలెబ్రెటీల వాయిస్‌లు పర్‌ఫామ్ చేసి.. ప్రజలను అబ్బుర పరిచారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిల ముందు కూడా శివారెడ్డి మిమిక్రీ చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై అతను చేసిన కమెడీకి కడుబుబ్బా నవ్విన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి శివారెడ్డి.. గత కొంతకాలంగా వెండితెరపై కనిపించడం లేదు. దాదాపు 7 సంవత్సరాలుగా ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు.

శివారెడ్డి మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన మాట నిజమే కానీ.. నా అంతట నేను దూరం కాలేదు. వాళ్లే నన్ను దూరం పెట్టారన్నారు. నేను అసలు ఏం తప్పు చేశానో.. లేక నా క్యారెక్టర్ బాగోలేదనో కానీ.. వాళ్లే నాకు క్యారెక్టర్లు ఇవ్వడం లేదన్నారు. బయటకెళ్లినప్పుడు కొందరు నన్ను అడుగుతూంటుంటే.. చాలా బాధగా అనిపిస్తోందని చెప్పారు శివారెడ్డి. కొంతమంది చేసిన తప్పులకు దూరమవుతారు. కొందరికి క్యారెక్టర్ లేక చిత్ర పరిశ్రమకి దూరమవుతారు. కానీ నాకు రెండూ ఉన్నాయి. కేవలం కొందరు మాత్రమే గ్రూపులుగా తయారయ్యి తనని ఇండస్ట్రీ నుంచి దూరం చేశారన్నారు. అంతేకాదు నన్ను తొక్కేసిన వ్యక్తులు ఎవరో కూడా తెలుసని.. అయినా వాళ్ల పేర్లు బయటపెట్టనన్నారు.

కాగా.. డైరెక్టర్ దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి లాంటివాళ్లు ఎంతో మంది నా గురించి ప్రస్తావిస్తూ పొగిడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. నన్ను ఓ పాత్ర కోసం ఎంత కష్టపెట్టినా నటిస్తాను. అవకాశాలు ఇవ్వనప్పుడు వారిని గీకుతూ, గోకుతూ ఉండలేను కదా. ప్రజలకు నాపై ఉన్న అభిమానంతో.. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు శివారెడ్డి.