మా అడుగులు ముందుకే..రాజధానిపై సంతకాల సేకరణ

| Edited By: Srinu

Jan 30, 2020 | 4:53 PM

ఏపీ రాజధాని అమరావతి వివాదం ముదురుతోంది. అమరావతికి మద్దతుగా ఓ వైపు టీడీపీ, రైతు జేఏసీ ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా, మరోవైపు వైసీపీ శ్రేణులు సైతం పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు, సంతకాల సేకరణ మొదలు పెట్టింది. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు సంతకాలు సేకరిస్తున్నారు. అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో ఏపీలో వైసీపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఇందుకోసం భారీ ర్యాలీని ఏర్పాటు చేసింది. పాలనా వికేంద్రీకరణ, […]

మా అడుగులు ముందుకే..రాజధానిపై సంతకాల సేకరణ
Follow us on

ఏపీ రాజధాని అమరావతి వివాదం ముదురుతోంది. అమరావతికి మద్దతుగా ఓ వైపు టీడీపీ, రైతు జేఏసీ ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా, మరోవైపు వైసీపీ శ్రేణులు సైతం పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు, సంతకాల సేకరణ మొదలు పెట్టింది. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు సంతకాలు సేకరిస్తున్నారు. అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో ఏపీలో వైసీపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఇందుకోసం భారీ ర్యాలీని ఏర్పాటు చేసింది. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, లాయర్లు, పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు.

పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా నిన్న విజయనగరం పట్టణంలో వైసీపీ సంతకాల సేకరణ చేపట్టింది. పట్టణ ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి మద్దతుగా విశాఖలో సంతకాల సేకరణ జరిగింది. అటు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ రాజధానిపై ప్రభుత్వానికి మద్దతుగా సంతకాలు సేకరించారు.

ఇటు రాయలసీమలోనూ ముమ్మరంగా సంతకాల సేకరణ జరిగింది. వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో కడప ఏడురోడ్ల కూడలిలో సంతకాల సేకరణ జరిగింది. సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అనంతపురం జిల్లా ప్రజానీకం మద్దతు తెలిపింది. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా సంతకాలు చేశారు.

‘మూడు రాజధానులు ముద్దు.. అమ్మ ఒడికి స్వాగతం.. మాకు ఇంగ్లిష్‌ మీడియం కావాలి’ అనే నినాదాలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, సీఎం జగన్‌ ఫొటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మానవహారంగా ఏర్పాటయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు చేపట్టాయి. ఈ ర్యాలీల్లో ప్రజలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొని పాలనా వికేంద్రీకరణకు మద్దతు పలికారు. మూడు రాజధానులే ముద్దు అంటూ నినాదాలు చేశారు.