Cobra Movie Teaser Out: ప్రయోగాలకు పెట్టింది పేరు తమిళ హీరో విక్రమ్. ఇప్పటి వరకు విక్రమ్ నటించిన సినిమాలను చూస్తే ఇది కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు విక్రమ్.
కథల ఎంపికలో వైవిద్యత, పాత్రల తీరులో ఊహకు కూడా అందకుండా వినూత్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న విక్రమ్ తాజాగా ‘కోబ్రా’ పేరుతో అలాంటి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20 పాత్రలు పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్ సమయంలోనే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1.47 నిమిషాలున్న ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో విక్రమ్ గణిత జీనియస్‌గా కనిపించనున్నాడు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని విక్రమ్ చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో టీమిండియా మాజీ క్రీడాకారుడు పఠాన్ తన నటనతో అదరగొట్టాడు. ఇక టీజర్ గమనిస్తే అసలు సినిమా కథ ఏంటన్నది ఒక పట్టాన అర్థం కావట్లేదు. టైటిల్‌గా కోబ్రాను ఎందుకు పెట్టారు.? విక్రమ్ అన్ని గెటప్‌లలో కనిపించడానికి కారణమేంటి.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.
Also Read: Hero Ram pothineni: లవర్ బాయ్ లుక్‌లో హీరో రామ్.. ఆమ్లెట్ వేస్తూ ఫోజులిచ్చిన ఎనర్జిటిక్ స్టార్..