శ్రీవారి సేవలో కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనం కోసం నిన్నే తిరుమల చేరుకున్నారు కేసీఆర్. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. టీటీడీ ఈవో అనిల్ […]

శ్రీవారి సేవలో కేసీఆర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 27, 2019 | 4:59 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామి వారి దర్శనం కోసం నిన్నే తిరుమల చేరుకున్నారు కేసీఆర్. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.