గ్రేటర్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ ఫోకస్, నేడు మంత్రులతో సీఎం భేటీ…మాస్టర్ ప్లాన్ రెడీనా ?

|

Nov 12, 2020 | 9:32 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెడుతోంది. ఎన్నికల నిర్వహణపై అందుబాటులో ఉండే మంత్రులతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

గ్రేటర్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ ఫోకస్, నేడు మంత్రులతో సీఎం భేటీ...మాస్టర్ ప్లాన్ రెడీనా ?
Follow us on

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెడుతోంది. ఎన్నికల నిర్వహణపై అందుబాటులో ఉండే మంత్రులతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్‌ పీఠం లక్ష్యంగా ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఒకటి, రెండురోజుల్లో కేబినెట్‌ భేటీ కూడా ఉండే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలికి వచ్చే ఫిబ్రవరి వరకు గడువు ఉండగా అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్‌ యోచిస్తోంది.

షెడ్యూలుపై గతంలో కొంత అస్పష్టత ఉండగా.. దుబ్బాక ఎన్నికల ఫలితంతో జీహెచ్‌ఎంసీలోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

Also Read :

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !

పెరిగిన చలి, కరోనాతో తస్మాత్ జాగ్రత్త !