Nalgonda accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

|

Jan 21, 2021 | 10:49 PM

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా పిఏ పల్లి మండలం అంగడిపేట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలుస్తుంది

Nalgonda accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Follow us on

Nalgonda accident :  నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా పిఏ పల్లి మండలం అంగడిపేట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలుస్తుంది. .14 మంది తీవ్ర గాయాలపాలవ్వగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వారుగా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో లారీని ఢీకొట్టింది. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో 11 మందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇక ఈ ప్రమాదం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను కేసీఆర్ ఆదేశించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

CM KCR Review TSRTC: తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష.. నష్టాల్లో కొనసాగుతుందని తెలిపిన అధికారులు