Sheep Distribution: గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్ చెప్పారు.  రాష్ట్రంలో మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Sheep Distribution:  గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Edited By:

Updated on: Jan 09, 2021 | 12:49 PM

Telangana Sheep Distribution:  సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్ చెప్పారు.  రాష్ట్రంలో మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీని సర్కార్ చేపట్టింది. మొదటి విడతలో మూడు లక్షలా 67 వేల యూనిట్లు పంపిణీ చేశారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆ కార్యక్రమం చివరి స్టేజీలో నిలిచిపోయింది. అప్పటికే దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు.

తాజాగా వారందరికీ తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్​లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
Also Read :

Mystery Illness: వికారాబాద్​ జిల్లాలో కలకలం.. 45 మందికి అస్వస్థత.. వింత వ్యాధి అంటూ స్థానికుల ఆందోళన

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి