CM Jagan Crucial Comments: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. విగ్రహాల విధ్వంసకులను దేవుడే శిక్షిస్తాడన్న ముఖ్యమంత్రి

ఏపీలో చర్చనీయాంశంగా మారిన విగ్రహాల విధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు మరింత కఠినంగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్ళ విగ్రహాలతో...

CM Jagan Crucial Comments: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. విగ్రహాల విధ్వంసకులను దేవుడే శిక్షిస్తాడన్న ముఖ్యమంత్రి

Updated on: Dec 31, 2020 | 4:10 PM

CM Jagan warns AP Police: ఏపీలో చర్చనీయాంశంగా మారిన విగ్రహాల విధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు మరింత కఠినంగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్ళ విగ్రహాలతో చెలగాటమాడే వారిని దేవుడే శిక్షిస్తాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

విగ్రహాల విధ్వంసంపై ఉన్నత అధికారులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణం.. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు.. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలి.. ’’ అని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించారు.

ఏపీలో ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల దేవుళ్ళ విగ్రహాల విధ్వంసం జరిగిన నేపథ్యంలో బీజేపీ నేతలతోపాటు కొందరు స్వాములు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాజకీయం అవుతుండడంతో ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో గురువారం భేటీ అయ్యారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఉదంతాలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను నిర్దేశించారు.

ALSO READ: ఆ మాట ఎక్కడా వినిపించొద్దు.. ఉన్నతాధికారులకు ఏపీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

Loading...
Unable to load recommendations.
Follow Us