గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా అంశాల‌పై చర్చ

సీఎం జ‌గ‌న్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు మర్యాదపూర్వకంగా ఈ స‌మావేశం జ‌రిగింది.

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా అంశాల‌పై చర్చ

Updated on: Jun 22, 2020 | 11:01 PM

సీఎం జ‌గ‌న్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు మర్యాదపూర్వకంగా ఈ స‌మావేశం జ‌రిగింది. సీఎం జ‌గ‌న్ వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మరికొందరు నాయ‌కులు ఉన్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ, శాసన మండలి బడ్జెట్ మీటింగ్స్ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ అవుతుండడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ మీటింగ్ జర‌గిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర గవ‌ర్న‌మెంట్ తీసుకుంటోన్న చర్యలు, వ్యాధి నిర్ధరణ టెస్టుల‌ వివరాలను సీఎం… ఈ భేటీలో గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. శాసనసభ, శాసన మండలిలో బడ్జెట్ మీటింగ్స్ సంద‌ర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లు స‌మాచారం. ఎమ్మెల్సీలు పిల్లి సుబాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం.. వారు రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.