ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ఇవే కీలక అంశాలు…

|

Oct 04, 2020 | 6:28 AM

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 6న భేటీ కానున్నారు. సీఎం జగన్‌ ఈ మంగళవారం ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.  సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అమరావతి నుంచి పులివెందులకు చేరుకుంటారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ఇవే కీలక అంశాలు...
Follow us on

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 6న భేటీ కానున్నారు. సీఎం జగన్‌ ఈ మంగళవారం ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.  సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అమరావతి నుంచి పులివెందులకు చేరుకుంటారు. అక్కడ జరిగే అభివ‌ృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం… మధ్యాహ్నం 3.15 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

ఈ మంగళవారం (6వ తేదీ) ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై అపెక్స్‌ కమిటీ భేటీ ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ పాల్గొంటారు.

అదే రోజున ప్రధానితో జగన్‌ సమావేశం కానున్నారు. పోలవరానికి నిధులతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది.