సీఎం జ‌గ‌న్ మ‌రో నిర్ణ‌యం.. ఆ మత్స్యకారులకు రూ.2 వేలు ఆర్థిక సాయం

|

Apr 29, 2020 | 3:50 PM

రాష్ట్రంలో కరోనా తీవ్ర‌త..‌ నివారణ చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితిపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డిప్యూటి సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, సంబంధిత‌ అధికారులు హాజ‌ర‌య్యరు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని సీఎంకు నివేదించారు. ఈ సంద‌ర్భంగా గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకొస్తున్న అంశంపై సీఎం వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. […]

సీఎం జ‌గ‌న్ మ‌రో నిర్ణ‌యం.. ఆ మత్స్యకారులకు రూ.2 వేలు ఆర్థిక సాయం
Follow us on

రాష్ట్రంలో కరోనా తీవ్ర‌త..‌ నివారణ చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితిపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డిప్యూటి సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, సంబంధిత‌ అధికారులు హాజ‌ర‌య్యరు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని సీఎంకు నివేదించారు.

ఈ సంద‌ర్భంగా గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకొస్తున్న అంశంపై సీఎం వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. 4,065 మందికిపైగా బస్సుల్లో సొంత ఊర్ల‌కు బయల్దేరారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రవాణా సదుపాయం, భోజనం, దారి ఖర్చులు ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని చెప్పారు. మత్స్యకారులు ఇళ్ల‌కు చేరుకున్నాక త‌క్ష‌ణ సాయంగా వచ్చాక ఒక్కొక్క‌రికి రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందించాని సీఎం అధికారులను ఆదేశించారు.