నిరసన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి

|

Oct 02, 2020 | 8:54 PM

దేశంలో ఎక్కడా కూడా లైంగిక దాడి ఘటనలు జరుగకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
Follow us on

దేశంలో ఎక్కడా కూడా లైంగిక దాడి ఘటనలు జరుగకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

ఈ అంశంలో ఎలాంటి రాజకీయాలు వద్దని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిామండ్ చేశారు. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందాలని కోరారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ నేత డీ రాజా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అయితే ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న సమయంలో భారీ ర్యాలీ నిర్వహించడంపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు.