
సరదా.. ప్రాణాల మీదకు తెస్తోంది. పసి ప్రాణాలను తీస్తోంది. వ్యసనంగా మారిన పబ్జీ గేమ్‌కు హైదరాబాద్‌లో మరో నిండు ప్రాణం బలైపోయింది. మల్కాజ్‌గిరిలో నివాసం ఉంటున్న భరత్‌రాజ్, ఉమాదేవిల కుమారుడు సాంబశివ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే.. బుధవారం లాస్ట్ ఎగ్జామ్ రాయాల్సివుండగా ఇంతలోనే పబ్జీ రూపంలో మృత్యువు అతన్ని కబళించింది.
ఎగ్జామ్‌కు ప్రిపేర్ కాకుండా.. సెల్‌ఫోన్‌లో లీనమై పబ్జీ గేమ్ ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు గేమ్స్ జోలికి వెళ్లొద్దని చెప్పారు. అంతే.. అమ్మ తిట్టిందనే మనస్థాపమో.. నిమిషం కూడా నిలవనీయని పబ్జీ మాయాజాలమో కానీ.. సాంబశివ ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ తిట్టగానే.. కోపంగా గదిలోకి వెళ్లిన సాంబశివ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో.. పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన చూసిన తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.