కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో విద్యార్థులు, పోలీసులకు తీవ్ర మధ్య ఘర్షణ చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం తిరువనంతపురంలో కేరళ స్టూడెంట్ యూనియన్ ఆందోళనకు దిగింది. యూనియన్ పిలుపు మేరకు వందల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వారు నిరసనకు దిగారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని విమర్శించారు.
మరోవైపు.. విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అందరూ రోడ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా పోలీసులు వాటర్ క్యానన్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
[svt-event date=”17/06/2020,6:41PM” class=”svt-cd-green” ]
Kerala: A clash broke out between police personnel and members of Kerala Students Union (KSU) in Thiruvananthapuram today, during protest against state government policies. Police used water canon and tear gas shells to disperse the protestors. pic.twitter.com/GiQN68E0k0
— ANI (@ANI) June 17, 2020