లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం!

| Edited By: Srinu

Dec 10, 2019 | 12:52 PM

సుమారు 12 గంటల పాటు పౌరసత్వ సవరణ బిల్లు పై జరిగిన చర్చలు ముగిసాయి. మొత్తం 391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన […]

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం!
Follow us on

సుమారు 12 గంటల పాటు పౌరసత్వ సవరణ బిల్లు పై జరిగిన చర్చలు ముగిసాయి. మొత్తం 391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన సమయంలో మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు ఈ బిల్లును వివక్షపూరితంగా చెప్పే హక్కు ఆ పార్టీకి లేదని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి “మైనారిటీ వలసదారులకు” పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించినందున ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాయి, ముస్లిం సమాజానికి చెందిన వారిని దాని పరిధి నుండి తప్పించింది.

 

[svt-event date=”10/12/2019,1:16AM” class=”svt-cd-green” ]