సీఐఎస్‌సీఈ పరీక్షల తేదీ ఖరారు..!

|

May 22, 2020 | 5:46 PM

కరోనావైరస్ దెబ్బకు విద్యాసంవత్సరం రూపురేఖలే మారిపోయాయి. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ ( సీఐఎస్‌సీఈ) సిద్దమైంది. కొన్ని సబెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించిన ఐసీఎస్సీ లాక్ డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా వేసింది. 10వ తరగతి, 12 వ తరగతి పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను సీఐఎస్‌సీఈ శుక్రవారం విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలను జూన్‌ 2 నుంచి జూలై 12 వరకు నిర్వహించన్నారు. […]

సీఐఎస్‌సీఈ పరీక్షల తేదీ ఖరారు..!
Follow us on

కరోనావైరస్ దెబ్బకు విద్యాసంవత్సరం రూపురేఖలే మారిపోయాయి. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ ( సీఐఎస్‌సీఈ) సిద్దమైంది. కొన్ని సబెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించిన ఐసీఎస్సీ లాక్ డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా వేసింది. 10వ తరగతి, 12 వ తరగతి పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను సీఐఎస్‌సీఈ శుక్రవారం విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలను జూన్‌ 2 నుంచి జూలై 12 వరకు నిర్వహించన్నారు. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు సీఐఎస్‌సీఈ ప్రకటించింది. ఈ పరీక్షలు రోజు విడిచి రోజు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 11గంటలకు మొదలు కానున్నాయి. విద్యార్థులు కొవిడ్ 19 జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అలాగే పరీక్ష కేంద్రాలను అన్ని విధాలుగా శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.