AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సీన్ పై సిప్లా కీలక ప్రకటన!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనాకు నివారణ మందును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ సిప్లా ప్రకటించింది.

కరోనా వ్యాక్సీన్ పై సిప్లా కీలక ప్రకటన!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 22, 2020 | 6:01 PM

Share

Cipla’s antiviral drug Cipremi: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనాకు నివారణ మందును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ సిప్లా ప్రకటించింది. సిప్రెమి పేరుతో ఈ మందును విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మందును యాంటీవైరల్ డ్రగ్ రెమిడీసివిర్‌కు జనరిక్ వెర్షన్‌గా సిప్లా తెలిపింది. కోవిడ్-19 బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితుల్లో సిప్రెమినీ అందిస్తే ఫలితం ఉంటుందని వెల్లడించింది.

కాగా.. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ పరిశోధనాత్మక థెరపీలో యాంటీవైరల్ డ్రగ్ రెమ్డీసివిర్‌ను ఇప్పటికే భాగం చేసిన సంగతి తెలిసిందే. సిప్లా వెల్లడించిన సిప్రెమి కరోనా నివారణకు తాజాగా కనుగొన్న మందుల్లో మూడవది కావడం గమనార్హం. ఇప్పటికే ఫాబిఫ్లూ పేరుతో గ్లెన్‌‌‌మార్క్, కోవిఫర్ పేరుతో హెటెరో కోవిడ్-19 నివారణకు మందులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.

యాంటీవైరల్ డ్రగ్ రెమ్డీసివిర్ ‌ను కోవిడ్-19 బారిన పడిన చిన్నారులకు, యువతీయువకులకు అత్యవసర సందర్భాల్లో మాత్రమే చికిత్సలో భాగంగా అందించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ సిప్రెమి ధరను త్వరలో సిప్లా వెల్లడించనుంది. రెమ్డీసివిర్‌కు జనరిక్ వెర్షన్ అయిన ఈ సిప్రెమి గురించి సిప్లా ఫార్మా సోమవారం వెల్లడించిన కొన్ని గంటలకే బీఎస్‌ఈలో సిప్లా షేర్లు 9శాతం వృద్ధి చెందడం విశేషం.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..