కన్నుమూసిన ‘లవకుశ’ నాగరాజు

|

Sep 07, 2020 | 12:43 PM

లవుడి పాత్రతో తెలుగువారందరికీ ఆత్మీయుడుగా మారిన నాగరాజు ఇక లేరు.. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కన్నుమూసిన లవకుశ నాగరాజు
Follow us on

లవుడి పాత్రతో తెలుగువారందరికీ ఆత్మీయుడుగా మారిన నాగరాజు ఇక లేరు.. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారాయన! ఎన్‌.టి.రామారావు రాముడిగా, అంజలీదేవి సీతమ్మగా నటించిన లవకుశ సినిమా 1963లో విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. సుబ్రహ్మణ్యం మళ్లీ తెరపైకి రాలేదు కానీ, నాగరాజు మాత్రం సినిమాల్లో కంటిన్యూ అయ్యారు.. భక్త రామదాసు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసిన నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు.. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఎ.వి.సుబ్బారావు కుమారుడే నాగరాజు.. నాగరాజు పెద్దయ్యాక అనేక పౌరాణిక చిత్రాలలో నటించారు. సుమారు 300 సినిమాలలో నటించిన నాగరాజు మృతికి తెలుగు సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది.