మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మనకు స్ఫూర్తి…

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగానే కాదు దేశానికి రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తిధాతగా నిలిచారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలకు జీవితమంటే ఎంతో గొప్పదని తనకి తాను ఆచరించి నిరూపించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్ధుల్ కలాం. అంతటి మహనీయుడు...

మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మనకు స్ఫూర్తి...

Updated on: Oct 15, 2020 | 3:13 PM

Chiranjeevi Remembers : మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగానే కాదు దేశానికి రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తిధాతగా నిలిచారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలకు జీవితమంటే ఎంతో గొప్పదని తనకి తాను ఆచరించి నిరూపించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్ధుల్ కలాం. అంతటి మహనీయుడు మన మధ్య లేకపోవచ్చేమోగానీ ఆయన ఆశయాలు, సంకల్పాలు ప్రతీక్షణం మనలో స్పూర్తినింపుతూనే ఉంటాయి. భరతజాతి ముద్దుబిడ్డ డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జీవ‌న ప్ర‌స్థానంలోని కీల‌క ఘ‌ట్టాల‌ను ప్ర‌తి ఒక్క‌రు నెమ‌రువేసుకుంటున్నారు. ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాంను మెగస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓ సంద‌ర్భంలో అబ్ధుల్ క‌లాంతో దిగిన ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దేశంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఆయ‌న‌ ఒకరు, దేశంలోని గొప్ప అధ్యక్షులలోను ఆయన ఒక‌రు, మంచి మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషి భార‌త రత్న డాక్టర్.ఎ.పి.జె.అబ్దుల్ కలాం. ఆయ‌న‌ జన్మదినోత్సవం సందర్భంగా అంద‌రం జ్ఞాపకం చేసుకుందాం అంటూ రాసుకొచ్చారు. అబ్దుల్ కలాం ఆలోచనలు ఎన్నో త‌రాల వారికి స్పూర్తిని నింపుతుంది అని చిరు త‌న ట్వీట్టర్‌‌లో పేర్కొన్నారు.