AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో ..

చైనాను వణికిస్తున్న వుహాన్ వైరస్ ఇప్పుడు అమెరికాలోను ప్రవేశించింది.  ఈ వైరస్ సోకి చైనాలో 9 మంది మరణించగా.. సుమారు 400 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు అమెరికాలో సీటెల్ నగరానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో అతడిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడని ఆసుపత్రి అధికారులు చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా చికిత్స చేస్తున్నట్టు వారు […]

వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో ..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 22, 2020 | 3:40 PM

Share

చైనాను వణికిస్తున్న వుహాన్ వైరస్ ఇప్పుడు అమెరికాలోను ప్రవేశించింది.  ఈ వైరస్ సోకి చైనాలో 9 మంది మరణించగా.. సుమారు 400 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు అమెరికాలో సీటెల్ నగరానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో అతడిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడని ఆసుపత్రి అధికారులు చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా చికిత్స చేస్తున్నట్టు వారు వివరించారు. సార్స్ తరహా వైరస్ తనకు సోకిందని అతడు చెప్పాడట. చైనాలోని వుహాన్ ప్రాంతానికి వెళ్లి ఈ నెల 15 న ఇతడు స్వదేశానికి తిరిగివచ్చాడు. దానికి రెండు రోజుల ముందే  చైనా నుంచి వచ్ఛే ప్రయాణికులను స్కాన్ చేసేందుకు ప్రధాన విమానాశ్రయాల్లోఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం నియమించడమే కాకుండా.. స్కానింగ్ ఏర్పాట్లు కూడా చేసింది. తాజాగా మరో ఐదు విమానాశ్రయాలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించారు.

2019 లో చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్‌ను కొరోనా వైరస్ లేక ‘2019-ఎన్-కొవ్’‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఇది మనుషుల మధ్య వ్యాప్తి చెందదని భావిస్తూ వచ్చినప్పటికీ.. అది సరికాదని, వ్యక్తులకు సులువుగా సోకుతుందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ధృవీకరించింది. ఈ వైరస్ కారణంగా గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలా  అన్న విషయాన్ని నిర్ణయించేందుకు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య వ్యవహారాల ఏజన్సీ బుధవారం అత్యవసరంగా సమావేశమవుతోంది. గతంలో సార్స్ వైరస్ సోకి, శ్వాస సరిగా ఆడక, విపరీతమైన జ్వరంతో చైనా, హాంకాంగ్ లలో దాదాపు 650 మంది మృతి చెందారు. థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌లలోనూ ఈ వైరస్ లక్షణాలను కనుగొన్నారు. కాగా…   ఈ వారంలో చైనా కొత్త ఏడాది వేడుకలు జరగనుండగా.. లక్షలాది మంది ప్రయాణాలకు సిధ్ధపడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్‌లో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వుహాన్ నుంచి వచ్ఛే ప్రయాణికుల పట్ల అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.