‘జగనన్న జీవ క్రాంతి’కి నేడు శ్రీకారం…45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి ఆర్థిక సాయం..

సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్‌ దూసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నా పట్టించుకోకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేసేలా చూస్తున్నారు. తాజాగా జగనన్న జీవక్రాంతి పథకానికి...

‘జగనన్న జీవ క్రాంతి’కి నేడు శ్రీకారం...45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి ఆర్థిక సాయం..

Updated on: Dec 10, 2020 | 5:51 AM

Jagananna Jeeva Kranti : సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్‌ దూసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నా పట్టించుకోకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేసేలా చూస్తున్నారు. తాజాగా జగనన్న జీవక్రాంతి పథకానికి నేడు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు.

అక్క చెల్లెమ్మలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జగనన్న జీవ క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు ముఖ్యమంత్రి. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.