కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ నిర్వహించనున్న ముఖ్యమంత్రి

ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. ఈ తరుణంలో కరోనా చీకట్లు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన సహచర కేబినేట్‌ మంత్రులతో కలిసి...

కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ నిర్వహించనున్న ముఖ్యమంత్రి

Updated on: Nov 14, 2020 | 3:47 PM

Diwali Pujan at the Akshardham Temple : దీపావళిని ఈ ఏడాది కొత్త జరుపుకునేదుకు ప్లాన్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఏడాదికి భినంగా జరుపుకుంటున్నారు. గత మార్చి నుంచి దేశంలో ప్రజలందరి జీవితాలలో కరోనా వలన అమవాస్య చీకట్లు అలుముకున్నాయి.

మరి ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. ఈ తరుణంలో కరోనా చీకట్లు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన సహచర కేబినేట్‌ మంత్రులతో కలిసి అక్షరధామ్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయంలోని అమ్మవారకిి పూజలు నిర్వహించనున్నారు.

శనివారం రాత్రి 7.39లకు లక్ష్మీ పూజ చేయనున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ స్టే ట్యూన్‌డ్‌ కేజ్రీ టీవి అంటూ లైవ్‌లో పూజా కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్‌ స్వయంగా తన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 2 కోట్ల ఢిల్లీ ప్రజలు అందరం కలిసి లక్ష్మి పూజ చేసి మన జీవితాలలోని కష్టాలను పారద్రోలుదామని ఆయన అందులో పిలుపునిచ్చారు.