రైలు వెయ్యండి.. మా వాళ్ల డబ్బులు మేమే భరిస్తాం: చత్తీస్‌గఢ్ సీఎం

Migrant workers: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తరలించేందుకు కనుక ప్రత్యేక రైళ్లు వేస్తామంటే కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తెలిపారు. సీఎం సూచనలతో రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి డాక్టర్ కమల్‌ప్రీత్ సింగ్.. రాయ్‌పూర్ డివిజనల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ (రైల్వే) శ్యాంసుందర్ గుప్తాకు లేఖ రాశారు. కాగా.. చత్తీస్‌గఢ్ […]

రైలు వెయ్యండి.. మా వాళ్ల డబ్బులు మేమే భరిస్తాం: చత్తీస్‌గఢ్ సీఎం

Edited By:

Updated on: May 04, 2020 | 9:04 PM

Migrant workers: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తరలించేందుకు కనుక ప్రత్యేక రైళ్లు వేస్తామంటే కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తెలిపారు. సీఎం సూచనలతో రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి డాక్టర్ కమల్‌ప్రీత్ సింగ్.. రాయ్‌పూర్ డివిజనల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ (రైల్వే) శ్యాంసుందర్ గుప్తాకు లేఖ రాశారు.

కాగా.. చత్తీస్‌గఢ్ వలస కూలీలను వెనక్కి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అందులో కోరారు. లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను రైళ్ల ద్వారా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారి ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాబట్టి వారి కోసం శ్రామిక్ స్పెషల్ రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..