
చంద్రయాన్-2 మరి కాసేపట్లో ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. GSLVMkIII-M1 క్రయోజనిక్ దశలో ఆక్సిజన్ నింపడం పూర్తయ్యింది. అనంతరం హైడ్రోజన్ నింపే ప్రక్రియ కూడా పూర్తయ్యింది. సరిగ్గా 2.51 నిమిషాలకు నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది.