పరీక్షల్లో గెలవడమే జీవితం కాదు : చంద్రబాబు

అమరావతి : తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్థుల మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని.. అది కేవలం ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అన్నారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని.. పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రుల ఆశలను చెరిపేయొద్దని విద్యార్ధులకు సూచించారు. ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ తొలుత […]

పరీక్షల్లో గెలవడమే జీవితం కాదు : చంద్రబాబు

Edited By:

Updated on: Apr 24, 2019 | 7:08 PM

అమరావతి : తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్థుల మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని.. అది కేవలం ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అన్నారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని.. పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రుల ఆశలను చెరిపేయొద్దని విద్యార్ధులకు సూచించారు. ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ తొలుత పరాజితులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చదువు విజ్ఞానం పెంచుకోవడానికేనని, అదే జీవితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.