రెండోసారి ఈడీ ముందుకు చందాకొచ్చర్

| Edited By:

May 13, 2019 | 1:20 PM

వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటోన్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చార్ నేడు మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ గతంలో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, మరిది రాజీవ్‌లకు గత నెల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపక్, రాజీవ్‌లు విచారణకు రాగా.. తాజాగా చందాకొచ్చర్ హాజరయ్యారు. కాగా వీడియెకాన్ గ్రూప్ రుణాల అవకతవకల […]

రెండోసారి ఈడీ ముందుకు చందాకొచ్చర్
Follow us on

వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటోన్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చార్ నేడు మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ గతంలో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, మరిది రాజీవ్‌లకు గత నెల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపక్, రాజీవ్‌లు విచారణకు రాగా.. తాజాగా చందాకొచ్చర్ హాజరయ్యారు. కాగా వీడియెకాన్ గ్రూప్ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందాకొచ్చర్ గత ఏడాది అక్టోబర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ గ్రూప్ రూ.3,250కోట్ల రుణాలు పొందిందని, దీని వలన కొచ్చర్ కుటుంబం లాభపడిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.