Kanna comments: చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేస్తున్నారు.. జగన్‌పై కన్నా విసుర్లు

|

Feb 20, 2020 | 2:06 PM

జగన్ ప్రభుత్వ విధానాలపై ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇసుక విధానాన్ని తప్పుపట్టింది. అక్రమ అరెస్టులపై మండిపడింది కమలదళం. మత వైషమ్యాలను రెచ్చగొడుతున్న అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Kanna comments: చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేస్తున్నారు.. జగన్‌పై కన్నా విసుర్లు
Follow us on

AP BJP chief Kanna Laxminarayan anger on AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ముక్యమంత్రిపై ఘాటైన పదజాలంతో సెటైర్లు వేశారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు.

రాష్ట్రంలో బీజేపీ కేడర్‌పై అకారణంగా కేసులు పెడుతున్నారని, కనీసం గిరిజనులను కూడా వదలకుండా అట్రాసిటీ కేసులు పెడుతున్నారని కన్నా ఆరోపించారు. డీజీపీని కలిసినా కేసులు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులకు జగన్ ప్రభుత్వం అండ ఉన్నట్లు తెలుస్తోందన్నారాయన. ప్రభుత్వ అండతోనే దాడులు అనడంలో సందేహం లేదని చెబుతున్నారు కన్నా.

జనసేనతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు బీజేపీ రెడీ అవుతుందన్నారు. గత 5 ఏళ్ళు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందని…ఇప్పుడు అదే జరుగుతుందని కన్నా ఆరోపించారు. ఇసుకపై ప్రభుత్వం చూపిస్తున్న కాగితాల్లో లెక్కలు వేరు…వాస్తవం వేరని ఆయన కామెంట్ చేశారు. అన్ని రేట్లు పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారని, చెక్లెట్ ఇచ్చి నెక్లెస్ దోచిన విధంగా ప్రభుత్వ పాలన ఉందని కన్నా వ్యాఖ్యానించారు.

జనసేన, బిజెపి కలిసి ఏ విధంగా ఎన్నికల్లో కలిసి పని చేయాలనేదానిపై పదాధికారుల భేటీలో చర్చించినట్లు చెప్పారు కన్నా. ఒవైసీ సభలకు ఏపీ హోం శాఖ మంత్రి, డీజీపీ అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేసింది పదాధికారుల సమావేశం. ఒవైసి ఉద్దేశ పూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే ఆయన సభలకు అనుమతి ఇవ్వకూడదని, ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని అరెస్టు చేయాలని బీజేపీ పదాధికారుల సమావేశం ఏపీ డీజీపీని డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వెల్లడించారు.

Also read: Three Rajyasabha members slowly distancing from AP BJP