సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యం, కేంద్ర మంత్రి సోంప్రకాష్, రైతుల సమస్య పరిష్కారం కావచ్చు

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 9:51 PM

రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లను విచారించి సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు అందరికీ శిరోధార్యమని కేంద్ర సహాయ మంత్రి సోం ప్రకాష్ అన్నారు. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పానెల్ ఏర్పాటు చేయాలని..

సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యం, కేంద్ర మంత్రి సోంప్రకాష్, రైతుల సమస్య పరిష్కారం కావచ్చు
Follow us on

రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లను విచారించి సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు అందరికీ శిరోధార్యమని కేంద్ర సహాయ మంత్రి సోం ప్రకాష్ అన్నారు. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పానెల్ ఏర్పాటు చేయాలని  కోర్టు సూచించడం హర్షణీయమన్నారు. ఈ కేసు చాలా రోజులుగా కొనసాగుతోందని, ఢిల్లీ బోర్డర్లో అన్నదాతలు ధర్నా చేస్తున్నారని ఆయన చెప్పారు. వారితో తాము కూడా చర్చలు జరిపామని, కోర్టు దీనిపై వ్యాఖ్యానించడం సంతోషకరమన్నారు. రేపు సమస్య పరిష్కారం కాగలదని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 5 గురి నుంచి ఏడుగురు సభ్యులతో కమిటీ వేద్దామని చర్చల సందర్భంగా తాము రైతులకు సూచించామని, కానీ అన్నదాతలంతా సభ్యులుగా ఆ కమిటీలో ఉండాలని వారు కోరారని సోం ప్రకాష్ గుర్తు చేశారు.

ఢిల్లీ నగరం చుట్టూ అనేకమంది చేరడం ఇదే మొదటిసారి.. నిజంగా ఇది జాతీయ సమస్యగా మారింది అని ఆయన చెప్పారు. ఇందులో సందేహం లేదన్నారు .కాగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు కమిటీ ఏర్పాటు, అందుకు తగిన విధివిధానాలపై కేంద్రం దృష్టి పెట్టింది. కాగా బుధవారం సింఘు సరిహద్దుల్లో ఓ సిక్కు గురువు ఆత్మహత్య చేసుకోవడంతో ఇక రేపటి పరిణామాలు ఎలా ఉంటాయోనని కేంద్రం ఆందోళన చెందుతోంది. .