క‌ష్ట‌కాలంలో కేంద్రం చేయూత‌..ఆ ప‌థ‌కం ద్వారా మ‌రో ఐదు నెల‌లు ఉచిత రేష‌న్

|

Jul 08, 2020 | 6:50 PM

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేదలు ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ అన్నా యోజన విస్తరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.

క‌ష్ట‌కాలంలో కేంద్రం చేయూత‌..ఆ ప‌థ‌కం ద్వారా మ‌రో ఐదు నెల‌లు ఉచిత రేష‌న్
Follow us on

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేదలు ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ అన్నా యోజన విస్తరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. దీని కింద జూలై నుంచి నవంబర్ వరకు మరో ఐదు నెలల పాటు పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతినెలా ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమ పిండి, ఒక్కో కుటుంబానికి 1కేజీ కంది పప్పును ఫ్రీగా ఇస్తారు. విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు 74.3 కోట్ల మంది లబ్ది పొందార‌ని తెలిపారు. మేలో 74.75 కోట్లు, 2020 జూన్‌లో 64.72 కోట్లు లబ్ధి పొందారని వివ‌రించారు. ముఖ్యంగా, ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) కరోనావైరస్ మహమ్మారితో తీవ్రంగా పేద‌లు, బ‌లహీన వ‌ర్గాల‌కు ఆస‌రాగా నిలిస్తుంద‌ని తెలిపారు. “ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన” ప‌థకాన్ని కూడా జులై నుంచి మూడు నెల‌లు పెంచుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇక మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్ర‌భుత్వ‌మే భరించనుంది. దీంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మయంలో పీఎఫ్ చందాదారులకు కాస్త ఊర‌ట క‌ల‌గ‌నుంది. పీఎఫ్ ఖాతాలో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) యాడ్ అవుతూ వ‌స్తుంది. అయితే కోవిడ్-19 కారణంగా సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంట్ ఈ కంట్రిబ్యూషన్‌ను భరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు కేంద్ర ప్ర‌భుత్వం పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ అకౌంట్‌లో జమచేస్తూ వచ్చింది. తాజాగా మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని మోదీ స‌ర్కార్ భరించనుంది. దీంతో జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర‌మే చెల్లిస్తోంది.