‘ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకంలో.. నోడల్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్ లు..

Prime Minister Garib Kalyan Rojgar Abhiyaan: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులకు పని కల్పించే ‘ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ను కేంద్రం మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పథకం ఉద్దేశం నెరవేర్చే క్రమంలో 116 సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్రం సెంట్రల్ నోడల్ అధికారులుగా నియమించింది. వీరందరూ జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులు. నోడల్ అధికారులు తమ […]

‘ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకంలో.. నోడల్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్ లు..

Edited By:

Updated on: Jun 24, 2020 | 5:26 PM

Prime Minister Garib Kalyan Rojgar Abhiyaan: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులకు పని కల్పించే ‘ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ను కేంద్రం మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పథకం ఉద్దేశం నెరవేర్చే క్రమంలో 116 సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్రం సెంట్రల్ నోడల్ అధికారులుగా నియమించింది. వీరందరూ జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులు.

నోడల్ అధికారులు తమ విధులను వీసీలు, డిజిటల్ మ్యాప్స్ మొదలైన వాటి ద్వారా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, వీటి వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ధృవీకరించవచ్చని పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌కి చెందిన అత్యంత సమర్థ అధికారులను నోడల్ అధికారులుగా కేంద్రం నియమించింది. ‘‘రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లతో ఈ నోడల్ అధికారులు అత్యంత సన్నిహితంగా పనిచేస్తూ ఈ పథకాన్ని అమలు చేయడానికి చూస్తారు’’ అని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.