అసోం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

|

Aug 24, 2020 | 7:28 PM

అసోంలో ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలకు దాదాపుగా 57 లక్షల మంది ప్రభావితమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో... మే 22 నుంచి ఆగస్టు 20 మధ్య భారీ వర్షాలకు వరదల ధాటికి సుమారు 113 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద బీభత్సంతో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం నుంచి అసోంలో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అసోం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
Follow us on

అసోంలో ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలకు దాదాపుగా 57 లక్షల మంది ప్రభావితమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో… మే 22 నుంచి ఆగస్టు 20 మధ్య భారీ వర్షాలకు వరదల ధాటికి సుమారు 113 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద బీభత్సంతో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం నుంచి అసోంలో పర్యటించనున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేయనున్నారు.

ఇక అసోంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి మరో 26 మంది మరణించారు. జాతీయ రాష్ర్ట రెస్క్యూ దళాలు సుమారు 81 వేల మందిని క్షతగాత్రులను వరదల నుంచి రక్షించారు. ముప్ఫై జిల్లాల్లో మొత్తం 2.65 లక్షల హెక్టార్లలో పంటలు వరదలకు తీవ్రంగా దెబ్బ తిన్నాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు ప్రకటించారు. ఇక… ప్రపంచ ప్రఖ్యాత కాజీరంగ నేషనల్ పార్కుతో సహా వివిధ అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు ప్రభావితమయ్యాయి. భారీ వరదలకు జూపార్క్ లోని 18 ఖడ్గమృగాలు, 135 అడవి జంతువులు కూడా వరదల బీభత్సంలో మరణించాయి. కాగా… కేంద్ర బృందం… వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టాన్ని అంచనా వేయడంతోపాటు, కేంద్రానికి నివేదించనుంది.