అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన దృష్ట్యా… కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఒకే దేశం-ఒకే రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేలా అనుమతి లభించింది. సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం-ఒకే రేషన్ అమల్లో ఉత్తరప్రదేశ్ ఆరో స్థానంలో నిలవడంతో ఆ రాష్ట్రం కూడా అదనపు రుణం పొందేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో యూపీ అదనంగా 4,851 కోట్లు పొందే అవకాశం ఉంది. కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఈ సౌలభ్యం కల్పించింది.(కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !)