కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన చట్టాలు పూర్తిగా రైతులకు అనుకూలంగానే ఉన్నాయని కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ అన్నారు. రైతులు తమ ఆందోళనను విరమించి కేంద్రంతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఇండోర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వ్యవసాయ రంగంలో చేసిన కృషిని ప్రజలందరూ అభినందిస్తున్నారని తెలిపారు. నూతన చట్టాలకు కొద్ది రాష్ట్రాల రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతులు తమ ఆందోళనలను విరమించి వెంటనే కేంద్రంతో చర్చలు జరపాలని ఈ సందర్భంగా రైతులను కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో ఐదు సార్లు చర్చలు జరిపిందని.. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. కొత్త చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికి ఈ చట్టాలు పూర్తిగా రైతులకు అనుకూలంగానే ఉన్నాయని, సాగుదారుల ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ చట్టాలను రూపొందించారని తెలిపారు.