AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి ఎగుమతులకు కేంద్రం ఓకే.. కానీ ఓ షరతు..!

రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం ఓకే చెప్పింది. నిత్యం 10 వేల క్వింటాళ్ల బెంగళూర్‌ గులాబీ రకం, కృష్ణాపురం రకాలను మార్చి 31 వరకు ఎగుమతి చేసుకోవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిని కేవలం చెన్నై ఓడరేపు ద్వారా మాత్రమే రవాణా చేయాలని షరతు విధించింది...

ఉల్లి ఎగుమతులకు కేంద్రం ఓకే.. కానీ ఓ షరతు..!
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2020 | 5:20 PM

Share

Onions Exports : రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం ఓకే చెప్పింది. నిత్యం 10 వేల క్వింటాళ్ల బెంగళూర్‌ గులాబీ రకం, కృష్ణాపురం రకాలను మార్చి 31 వరకు ఎగుమతి చేసుకోవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిని కేవలం చెన్నై ఓడరేపు ద్వారా మాత్రమే రవాణా చేయాలని షరతు విధించింది.

రైతుల ఆదాయం పెంచేందుకు వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్ర పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఎగుమతి చేసుకోవాలనుకునే వారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలని, ధ్రువీకరించిన నాణ్యమైన ఉల్లిని మాత్రమే ఎగుమతికి అనుమతిస్తామని వెల్లడించారు.

ఉల్లి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో ఎగుమతులపై గత నెలలో బ్రేక్ వేసింది. అయితే వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడ్డంతో తిరిగి అనుమతి ఇచ్చారు. విదేశాల్లోకి తరలిపోతున్న ఉల్లిని మన దేశంలోని స్థానిక మార్కెట్లలో తరలించారు. దీంతో స్థానికంగా ఏర్పాడుతున్న కొరతను నివారించారు.

Follow Us